విజయ్ వెతుకుతోన్న జయలక్ష్మీ ఎవరు..?

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు, తమిళ బాషల్లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, హీరో విజయ్ ఆంటోని ఇప్పుడు ‘బేతాళుడు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. తమిళంలో ‘సైతాన్’ పేరుతో విడుదలవుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు.

నిజానికి ఈ వారంలోనే సినిమా విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన డిసంబర్ 2న రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. వాటిని మరింత పెంచడానికి అన్నట్లు విజయ్ సినిమాలో ఓ పది నిమిషాల వీడియో క్లిప్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

ఈ సినిమా క్లిప్పింగ్ లో విజయ్ తనకు ఏదో పట్టినట్లుగా జయలక్ష్మీ అనే మహిళను వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈ వీడియో చూస్తున్నంతసేపు సినిమా ఇంకెంత థ్రిల్లింగ్ గా ఉంటుందని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఇంతకీ ఆ జయలక్ష్మీ ఎవరని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. పది నిమిషాల వీడియోనే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో.. అనే అంచనాలు పెరిగిపోతున్నాయి.