ఎన్టీయార్-చెర్రీ అన్నదమ్ములట!

రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేయబోతున్నట్లు వార్తలు హాల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జులైలో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ కథ విన్న చరణ్, ఎన్టీయార్ ఇద్దరూ కూడా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ రెండు పాత్రలతో పాటు మరో పవర్ ఫుల్ తల్లి పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్రలో నటి శ్రీదేవిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆ విధంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాకు హైప్ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయాల్లో ఎంతవరకు నిజముందో.. తెలియాలి. ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ ప్రాజెక్ట్ తో బిజీగా గడుపుతున్నారు.