ఆగస్టులో రానున్న ‘ఉంగరాల రాంబాబు’!

సునీల్ హీరోగా, మియాజార్జ్ జంట‌గా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విడుద‌ల‌కి సిధ్ధ‌మైన చిత్రం ఉంగరాల రాంబాబు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి.

స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. ఇప్ప‌టికే హీరో సునీల్ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం డిటియ‌స్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని రెండు వారాల్లో సెన్సారు కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటానికి సిధ్ధ‌మ‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు మూడ‌వ వారంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.