HomeTelugu Trendingలగ్జరీ కారవ్యాన్‌ కొలుగోలు చేసిన నరేశ్‌!

లగ్జరీ కారవ్యాన్‌ కొలుగోలు చేసిన నరేశ్‌!

Actor Naresh buys new vanit
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌.. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్లున్నాడు. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ సమయంలో షూటింగ్‌ స్పాట్‌లోనే గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడడం అంత మంచిది కాదని భావించిన నరేశ్‌.. ప్రత్యేకంగా ఓ కారవ్యాన్‌ కొలుగోలు చేశాడట. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట.

అందులో ఏసీ బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూప్‌తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయట. ఈ వ్యాన్‌ని ఆయన ముంబై నుంచి తెప్పించారట. దీని కోసం నరేశ్‌ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ క్యారెక్టర్‌ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవ్యాన్‌ లేదు. కొంతమంది సీనియర్‌ నటులకు అయితే నిర్మాతలే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట. అయితే నరేశ్‌ మాత్రం సొంతంగా క్యారవాన్‌ కొలుగోలు చేయడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!