‘నేను మహేశ్‌బాబుకు అడిక్ట్‌ అయిపోయా’

టాలీవుడ్‌ చూడచక్కని అన్యోన్యమైన జంటల్లో మహేశ్‌బాబు, నమ్రత ఒకరు. వీరిద్దరు ప్రత్యేక సందర్భాల్లో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. తాజాగా నమ్రత తన ప్రియమైన భర్తను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. మహేశ్‌ ఫొటోను షేర్‌ చేశారు. దానిపై ‘ప్రియమైన డ్రగ్స్‌ నువ్వు నాకు వద్దు.. నేను ఇప్పటికే మహేశ్‌బాబుకు అడిక్ట్‌ అయిపోయా’ అని రాశారు.

2001లో ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్‌, నమ్రతలకు పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. 2005లో ముంబయిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నమ్రత పలు హిందీ సినిమాల్లో నటించారు. 2014లో ‘అంజి’ సినిమాలో చివరిసారి ఆమె వెండితెరపై కనిపించారు.