పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్‌.. సైలెంట్‌గా జరిగిన ఎంగేజ్‌మెంట్!

హీరోయిన్‌ రెజీనా నిశ్చితార్థం సంద‌డి లేకుండా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా చాలా సైలెంట్‌గా జరిగిపోయిందని ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌ర‌స ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. కాగా ఈ మ‌ధ్య న‌టించిన సెవెన్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇందులో పూర్తిగా నెగిటివ్ రోల్ చేసింది రెజీనా.

ఈ సినిమా కూడా ఫ్లాప్ కావ‌డంతో.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక పెళ్లొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని.. ఆ వైపుగానే రెజీనా అడుగేస్తుంద‌ని తెలుస్తుంది. జూన్ 13న ఈమె నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎవ‌రూ క్లారిటీ స్పందించలేదు. అయితే ఈ మ‌ధ్య కాలంలో రెజీనా కొత్త సినిమాలు పెద్ద‌గా ఒప్పుకున్న‌ది లేదు. ప్ర‌స్తుతానికి ఒప్పుకున్న సినిమాలు అన్నీ పూర్తి చేసి కొత్త ఇన్నింగ్స్ మొద‌లు పెట్టాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

బిజినెస్ మ్యాన్‌తో రెజీనా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వ‌రుడు వివ‌రాలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా బ‌య‌టికి రాలేదు. ఇక ఇప్పుడు రెజీనా పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. మ‌రి చూడాలిక‌.. పెళ్లి త‌ర్వాత ఈ భామ సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదో..?