పెళ్లి పీటలు ఎక్కబోతున్న వర్ష!

బుల్లితెర యాంకర్‌ వర్ష… తన అందచందాలతో షోలో సందడి చేస్తుంది. కొన్ని సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. యాంకరింగ్‌, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోషూట్‌లతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

దానికి తోడు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. మరి ఇమ్మాన్యుయేల్‌ ఏమైపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4న వర్ష ఏం చెబుతుందనేది ఆలోచనలో పడ్డారు.

CLICK HERE!! For the aha Latest Updates