HomeTelugu Trendingపర్మిషన్‌ లేకుండా హీరోయిన్‌కు ముద్దు పెట్టేసిన కమల్‌ హాసన్‌.. వైరల్‌

పర్మిషన్‌ లేకుండా హీరోయిన్‌కు ముద్దు పెట్టేసిన కమల్‌ హాసన్‌.. వైరల్‌

5 25
విశ్వ నటుడు కమల్‌హాసన్ ఇటీవల కాలంలో తరచు వివాదాల్లో నిలుస్తున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు ఎలాంటి సాహసాలైనా చేయడం కమల్ నైజం. ఆయనలో రొమాంటిక్ యాంగిలే తాజాగా వివాదానికి కారణమైంది. రేఖ జంటగా నటించిన ప్రేమకావ్యం ‘పున్నగై మన్నన్‌’. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కమల్‌-రేఖ మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని కె.బాలచందర్‌ చిత్రీకరించారు. అయితే ఇటీవల రేఖ ‘పున్నగై మన్నన్‌’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన అనుమతి తీసుకోకుండానే బాలచందర్‌ చెప్పినదాని ప్రకారం కమల్‌హాసనన్‌ తనని ముద్దు పెట్టుకున్నారని రేఖ తెలిపారు. ఈ ముద్దు సీన్ కొన్ని నెలల పాటు మనో వేదనకు గురి చేసిందని రేఖ వెల్లడించారు. ఒకవేళ ముద్దు సన్నివేశం గురించి ముందే చెప్పినట్లు అయితే తాను అంగీకరించేదాన్ని కాదని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం రేఖకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కమల్‌హాసన్‌ వెంటనే రేఖకు క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై స్పందించాలని ఓ ఆంగ్ల పత్రిక రేఖను కోరగా… ‘నాకు చెప్పడానికి ఏం లేదు. ‘పున్నగై మన్నన్‌’ సినిమా గురించి ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎందుకు అంత పాపులర్‌ అయ్యిందో అర్థం కావడం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం అది జరిగింది. నా అంగీకారం లేకుండానే వాళ్లు ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ అది సినిమాకి ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడి పాపులారిటీని పొందాలనుకోవడం లేదు. నేను ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అంతేకాకుండా నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి’ అని రేఖ తెలిపారు.

5a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!