చిరంజీవి సినిమాలో విజయశాంతి?

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి కనిపించనున్నారట. చాల కాలం తరువాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను డైరెక్టర్‌ సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజు వారియర్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన ‘లూసిఫర్’ అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్‌ స్క్రిప్ట్‌లో మెగాస్టార్‌ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. చిరు సూచించిన సూచనల మేరకు సుజీత్‌ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మెగాస్టార్‌కు వినిపించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.