
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూరై… పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జరుపుకుంటుంది. అయితే షూటింగ్ గడిచి నెలలు అవుతున్న.. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఒక్కటి కూడా రాకపోవడంతో ప్రభాష్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దసరా పండుగ సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్ లో ‘ఆదిపురుష్’ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్ కొనసాగనున్నాయి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఓం రౌత్ డైరెక్షన్ లో వచ్చిన డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.













