సూర్యకు ధన్యవాదాలు: మోహన్‌బాబు

ప్రముక నటుడు సూర్య ఎన్జీకే తరువాత తన తదుపరి చిత్రంతో బిజీ అయ్యాడు. సుధా కొంగర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సూరారై పొట్రు చిత్రంలో మోహన్‌ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్‌లో తాజాగా మోహన్‌ బాబు జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా సూర్య ఓ ట్వీట్‌ చేశారు.

మోహన్‌బాబుతో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయనొక క్రమశిక్షణ గల నటుడని, 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనతో యాక్ట్‌ చేయడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చని.. తన సినిమాల్లో భాగం పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

దీనిపై మోహన్‌ బాబు స్పందిస్తూ.. ‘ఈ జెనరేషన్‌లో టాప్‌ స్టార్‌ అయిన సూర్య, ఆయన మాటలు, సెట్స్‌లో ప్రవర్తించే విదానమే ఆయన గురించి చెబుతాయి. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవాడు. ఆయనతో కలిసి నటించేందుకు తదుపరి షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నాను మిత్రమా.. నా గురించి ట్విటర్‌లో స్పందించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.