చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదు

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ఏర్పాటవుతున్న పాఠశాలను చిరంజీవికి చెందినవేనని, వాటి భాధ్యతల్ని నాగబాబు, రామ్ చరణ్ చూసుకుంటున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన పాఠశాలల సీఈవో శ్రీనివాస్ రావు తాము చిరు అభిమానులం కావడంతో తమ సంస్థలకు ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు.

అంతేకాదు చిరంజీవి కుటుంబం మీదున్న అభిమానంతో చిరంజీవిని గౌరవ ఫౌండర్ పదవిలో, నాగబాబును గౌరవ డైరెక్టర్ పదవిలో ఉంచామని, అంతేకానీ ఆ పాఠశాల నిర్వహణకు, మెగా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.