ప్రపంచ సుందరి గా ఐశ్వర్యరామ్‌ ‘థ్రోబ్యాక్‌’ ఫొటో .. వైరల్‌


బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వ‌ర్య‌రాయ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు నెటిజనులు.’1994’లో ప్రపంచ సుందరి టైటిల్ అందుకున్న సమయంలో తన తల్లితో కలిసి దిగిన ఫొటో అది. ఇప్పడు ఈ ‘థ్రోబ్యాక్‌’ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం ధరించి తల్లితో కలిసి ఆమె భోజనం చేసింది. వారిద్దరు కింద కూర్చొని భోజనం చేస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ప్రపంచ సుందరి టైటిల్ అందుకున్న సమయంలో ఐశ్వర్య ఎంతో భావోద్వేగం చెందింది. తాను అనుకున్నది సాధించానన్న తృప్తి ఆమెలో కనపడింది. ఆ సమయంలోనే తన త‌ల్లి బృందారాయ్ తో కలసి ఆమె భోజనం చేసింది. ఆ సందర్భంగా దిగిన ఆ ఫొటోను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.