చిరుకి ఐష్ ఓకే చెప్పింది కానీ..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనాలో ఉన్నారు. 80వ దశకంలో కలిసి పని చేసిన దక్షిణాది తారలందరూ ప్రతి ఏడాది ఒకసారి కలుస్తుంటారు. ఈసారి ఆ వేడుక చైనాలో ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల పాటు సంతోషంగా అందరూ విందు, వినోదాలతో పండగ చేసుకుంటారు. ప్రస్తుతం చిరు కూడా దానికోసం చైనాకు పయనమయ్యారు. అయితే మరోపక్క చిరు 151వ సినిమా కోసం తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు నాడు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపి సినిమా మొదలుపెట్టనున్నారు.
సెప్టెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకున్నారు. పలు తారల పేర్లు వినిపించినప్పటికీ ఐశ్వర్యారాయ్ ను ఫైనల్ చేశారనేది తాజా సమాచారం. ఆరు కోట్ల రెమ్యూనరేషన్, పరిమితి కాల్షీట్స్ మాత్రమే కేటాయించగలనని ఐష్ చెప్పడంతో ఆమెతో డీల్ 
కుదుర్చుకున్నారట. ఇక ఈ సినిమాకు రవివర్మ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మిగతా సాంకేతిక నిపుణులను, ఆర్టిస్టులను జులై నెలాఖరు నాటికి ఫైనల్ చేయనున్నారు.