HomeTelugu Trendingపుష్పరాజ్‌కు చెల్లిగా ఐశ్వర్య రాజేష్‌!

పుష్పరాజ్‌కు చెల్లిగా ఐశ్వర్య రాజేష్‌!

Aishwarya Rajesh in Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు పుల్ గా ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాని మరింత హైప్ కి తీసుకు వెళ్ళాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన ఐటమ్ కంపోజ్ చేశాడట. దానినే ఊర్వశిపై చిత్రీకరించనున్నారు. ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె బన్నీ సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఐశ్వర్య సెంటిమెంట్ ట్రాక్ సినిమాలో కీలకం అంటున్నారు. ఆమె చావుకి బన్నీ రివేంజ్ తీర్చుకోవడమనే అంశం హైలైట్ అవుతుందట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu