HomeTelugu Trendingమనసుని హత్తుకునేలా.. విమానం ట్రైలర్‌

మనసుని హత్తుకునేలా.. విమానం ట్రైలర్‌

Vimanam movie Trailer

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సముద్ర ఖని ప్రాధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాని.. జీ స్టూడియోస్ కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తల్లి లేని తన కొడుకు ను తనకు వీలైనంత వరకు సంతోషంగా చూసుకునే పాత్రలో ఆయన నటించారు. అందులో ఆయన అంగ వైకల్యంతో ఉన్న వ్యక్తి గా కనిపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన వారు ఎవరైనా కన్నీళ్లు పెట్టుకొని తీరతారు. కేవలం ట్రైలర్ తోనే ఏడిపించేశారు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ తండ్రి కొడుకుల ఎమోషనల్ రైడ్ వీరికి తోడు వీరిచుట్టూ ఉండే కొందరి కథలు ఓ వేశ్య కథ ను మేళవించి ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా అద్బుతంగా ఉంది.

ఇక సినిమా లో డైలాగులు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. కన్నకొడుకును ఎలాగైనా విమానం లో తీసుకెళ్లేందుకు రూ. 10 వేల కోసం తండ్రి ఉన్న సైకిల్ కూడా అమ్మే సీన్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అటు అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేషాలు కూడా అందరినీ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu