
Raid 2 box office collections:
అజయ్ దేవగణ్ నటించిన ‘రెయిడ్ 2’ సినిమా బాక్సాఫీస్‌ను ఊపేసింది. 2018లో వచ్చిన హిట్ మూవీ ‘రెయిడ్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బుధవారం (థర్స్‌డే) రూ.19.25 కోట్లు తో ఓపెనింగ్ దక్కించుకున్న ఈ చిత్రం, శుక్రవారం కొంత తగ్గి రూ.12 కోట్లు మాత్రమే సాధించింది. కానీ శనివారం 50 శాతం వృద్ధితో రూ.18 కోట్లు, ఆదివారం మరోసారి జంప్ కొట్టి రూ.21.50 కోట్లు వసూలు చేసింది. ఇలా వీకెండ్ మొత్తం కలిపి రూ.39.50 కోట్లు రాబట్టి, గతంలో విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ (₹30Cr), అక్షయ్ కుమార్ ‘కేసరి 2’ (₹22.75Cr), సన్నీ డియోల్ ‘జాట్’ (₹23.75Cr) సినిమాలను వెనక్కి నెట్టేసింది.
ఇక నాలుగు రోజుల్లో మొత్తం కలెక్షన్ రూ.70.75 కోట్లు దాటేసింది. గతంలో ‘రెయిడ్’ మొదటి వారం మొత్తంగా రూ.30.97 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ‘రెయిడ్ 2’ దాన్నే డబుల్ కలెక్షన్‌తో క్రాస్ చేయడం విశేషం.
పాజిటివ్ మౌత్ టాక్, మాస్ ఆడియెన్స్ స్పందన, థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో సినిమా ఫుల్ జోష్‌లో ఉంది. ఉదయం షోలో 19.38% ఆక్యుపెన్సీ ఉండగా, సాయంత్రానికి అది 55.07%కి పెరిగింది. నైట్ షోలు కూడా 39.42% ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ అయాయి.
ఇప్పుడు ఈ సినిమా ముందున్న టార్గెట్ – రూ.100 కోట్ల క్లబ్. సోమవారం టెస్టును బాగానే పాస్ అయితే, ఈ వారం లోపలే ఈ మార్కును దాటే అవకాశం ఉంది. అయితే మే 9న విడుదల కానున్న రాజ్‌కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ నుండి కాంపిటిషన్ ఎదురవుతుంది.
ALSO READ: Akshay Kumar తో 17 ఏళ్ల తర్వాత సినిమా చేయనున్న స్టార్ హీరో