HomeTelugu Trendingతమిళ హీరో అజిత్‌కు ప్రమాదం

తమిళ హీరో అజిత్‌కు ప్రమాదం

Ajith injured in movie shoo
తమిళ స్టార్ హీరో అజిత్‌కు షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వలిమై’ చిత్ర షూటింగ్ లో బైక్ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ చేతులు మరియు కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్‌లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వలిమై’ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఇందులో అజిత్ డూప్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం అజిత్ తన సొంత బైక్ ను ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu