అక్షయ్ లుక్ భయపెడుతోంది!

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం రోబో ‘2.0’. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనప్పటికీ.. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేస్తోన్న పోస్టర్లు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తోన్న
అక్షయ్ కుమార్ లుక్ ను రివీల్ చేశారు.

ఇప్పటికే ‘డాక్టర్ రిచర్డ్స్’ పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ విడుదల చేసినప్పటికీ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అక్షయ్ లుక్ భయపెడుతోంది. అతడి పలికిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్ ను బట్టి అక్షయ్ సినిమాలో తన నట
విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని తెలుస్తోంది.