త‌మిళనాట స‌మంత పొలిటిక‌ల్ ఎంట్రీ.!

స్టార్‌ హీరోయిన్‌ స‌మంత రాజ‌కీయాల్లోకి రావ‌డం ఏంటి.. ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తుంది..? అసలు ఎందుకు స‌మంత రాజ‌కీయాల్లోకి వ‌స్తుంద‌ని అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా.. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. స‌మంత రాజ‌కీయాల్లోకి వ‌స్తుంది మాత్రం నిజ‌మే.. కానీ నిజంగా మాత్రం కాదు.. ఇందులో క‌న్ఫ్యూజ‌న్ అవ‌స‌రం లేదు.. న‌య‌న‌తార‌, త్రిష మాదిరే ఇప్పుడు ఈమె కూడా రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో న‌టించ‌బోతుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

ఇక్క‌డ స‌మంత వ‌స్తుంది రియ‌ల్ పాలిటిక్స్ లోకి కాదు.. రీల్ పాలిటిక్స్‌లోకి మాత్ర‌మే. విజ‌య్ సేతుప‌తి హీరోగా ప్రసాద్ దీనదయాళ్ ద‌ర్శ‌క‌త్వంలో తుగ్లక్ దర్బార్ అనే సినిమా ఒక‌టి తెర‌కెక్కుతుంది. ఇది ప‌క్కా పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. దానికి తోడు పూర్తిగా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ కూడా. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం స‌మంత అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్. దాంతో స‌మంత‌కు క‌థ చెప్పి ఒప్పించాడ‌ని తెలుస్తుంది.

మార్చ్‌లో ఈ చిత్రంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై లలిత్ కుమార్ నిర్మించ‌నున్నాడు. ఏప్రిల్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం తెలుగులో సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ‘మ‌జిలి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళంలో విజ‌యం సాధించిన 96 సినిమా రీమేక్లో శర్వానంద్‌తో రొమాన్స్ చేయ‌నుంది. మొత్తానికి పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాల‌తో దుసుకుపోతుంది స‌మంత‌.