అఖిల్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

అక్కినేని అఖిల్ ‘అఖిల్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా అఖిల్ కు పెద్దగా
కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా నిర్మాతలకు నష్టాల్నే మిగిల్చింది. దీంతో
తన తదుపరి సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఫైనల్ గా విక్రమ్ కుమార్ ను డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. డైరెక్టర్ గురించి తెలిసినప్పటి నుండి
ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ
నేపధ్యంలో సినిమాను డిసంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి ప్లాన్ చేసినట్లు
తెలుస్తోంది. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నారని టాక్. ఇక హీరోయిన్
గా కొత్త అమ్మాయిని తీసుకోవాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates