
Sitaare Zameen Par Day 1 Collections:
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, తన కొత్త సినిమా Sitaare Zameen Par తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఇది 2007లో వచ్చిన క్లాసిక్ మూవీ తారే జమీన్ పరకు స్పిరిచువల్ సీక్వెల్ లా చెప్పుకుంటున్నారు.
అయితే ఇది ఒరిజినల్ కహానీ కాదు. స్పెయిన్ సినిమా చాంపియన్స్కి ఇది అఫీషియల్ రీమేక్. కథేమిటంటే… ఆమిర్ ఖాన్ ఇందులో ఒక బాస్కెట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తారు. మెంటల్ డెవలప్‌మెంట్ లో సమస్యలున్న కిడ్స్‌తో కలిసి ఒక జాతీయ స్థాయి టోర్నమెంట్ గెలవడం ఎలా సాధ్యమైంది అనేది సినిమా మెయిన్ హైలైట్.
ఆమిర్ పక్కా ప్రోమోషన్‌తో సినిమాను ఓ మంచి హైప్ తీసుకొచ్చాడు. ఫలితంగా మొదటి రోజే ఇండియా వ్యాప్తంగా ₹11.78 కోట్లు వసూలు చేసింది. ఇలాంటి కాన్సెప్ట్‌కు ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కమర్షియల్ మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా స్టోరీ అంతగా కనెక్ట్ కాకపోయినా… ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ వర్కౌట్ అయ్యింది.
ఆమిర్‌కి జోడీగా జెనీలియా దేశ్‌ముఖ్ కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెను పెద్ద స్క్రీన్‌పై చూడటం కూడా అభిమానులకు ఓ ప్లస్ పాయింట్ అయింది. దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న మంచి మేకింగ్ చూపించాడు. సినిమా నిడివి చిన్నగా, ఫిలింగ్ బాగా కంటిన్యూ అవుతుంది.
మొత్తం మీద సితారే జమీన్ పర ఒక ఫీల్ గుడ్ స్పోర్ట్స్ డ్రామా. ఓ స్పెషల్ టీమ్‌పై ప్రేక్షకుల దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్ అయిందనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది మంచి ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ALSO READ:Rashmika Mandanna రెమ్యూనరేషన్ ఎందుకు ఇంత తగ్గిందో తెలుసా?