HomeTelugu Trending'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి రొమాంటిక్ పోస్టర్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి రొమాంటిక్ పోస్టర్

Romantic poster from Most

అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని మూవీయూనిట్‌ విశ్వాసంగా ఉంది. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ ‘మనసా మనసా’ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో సినిమా నుండి ఒక రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అఖిల్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటుండగా.. అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పూజాహెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకిస్తుంది. దీంతో ఈ సినిమాలో యువతికి నచ్చే రొమాంటిక్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu