HomeTelugu Trendingగుడ్‌ న్యూస్ ట్రైలర్‌

గుడ్‌ న్యూస్ ట్రైలర్‌

4 16వరుణ్‌ బాత్రా(అక్షయ్‌), దీప్తి బాత్రా(కరీనా) భార్య భర్తలు. కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టకపోవడంతో వెళ్లి డాక్టర్‌ కలుస్తారు. ఆయన వారికి ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతి ద్వారా పిల్లలను కనవచ్చని చెబుతారు. అందుకు వారు ఒప్పుకొంటారు. అయితే, ఇక్కడే వైద్యుల పొరపాటు వల్ల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వరుణ్‌ బాత్రా వీర్యాన్ని హనీ బాత్రా(దిల్జిత్‌ దొసాంజే) భార్య మోనికా బాత్రా(కియారా అడ్వాణీ) గర్భంలో ప్రవేశపెడతారు. అదే సమయంలో హనీ బాత్రా వీర్యాన్ని దీప్తి బాత్రా గర్భంలోకి పంపిస్తారు. ఇరు జంటల పేర్ల వెనుక బాత్రా అని కామన్‌గా ఉండటంతో ఈ పొరపాటు జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ‘గుడ్‌ న్యూస్’ చూడాల్సిందే.

అక్షయ్‌కుమార్‌, కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజే, కియారా అద్వాణీ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. రాజ్ మెహతా దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా క్రిస్మస్‌ను పురస్కరించుకుని డిసెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తనిష్‌ భాగ్చి, రోచక్‌ కోహ్లీ తదితరులు సంగీతం అందిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌జోహార్‌, అపూర్వమెహతా, హిరో జోహార్‌, శశాంక్‌ ఖైతాన్‌లు ఈసినిమా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఆ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!