HomeTelugu Big Stories100 పౌండ్ల కోసం వేలాడిన అక్షయ్‌ కుమార్‌.. వీడియో వైరల్‌

100 పౌండ్ల కోసం వేలాడిన అక్షయ్‌ కుమార్‌.. వీడియో వైరల్‌

11 12బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఐదు పదుల వయసులోనూ ఫిట్‌గా ఉంటారు. అంతేకాదు అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లోనూ ఆయన టాప్‌ స్థానంలో ఉన్నారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించారు. ఇప్పటిదాకా సంపాదించింది చాలలేదన్నట్లు అక్షయ్‌.. 100 పౌండ్ల (రూ.8539) కోసం ఏం చేశారో చూడండి.

ప్రస్తుతం అక్షయ్‌ కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్‌లో ఉన్నారు. అక్కడి ఓ ప్రదేశంలో.. ‘ఎక్కువ సేపు వేలాడండి..100 పౌండ్లు గెలుచుకోండి’ అని ఓ ప్రకటనను పెట్టారు. అది చూసిన అక్షయ్‌ నేను చేయగలనంటూ వెళ్లి రాడ్డుని పట్టుకుని వేలాడారు. ఆ సమయంలో తీసిన వీడియోను ట్వింకిల్‌ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఫోర్బ్స్‌ జాబితాలో చేరింది చాలదన్నట్లు 100 పౌండ్ల కోసం ఇలా వేలాడుతున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇంకెంత సంపాదిస్తారు సర్‌..’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!