‘గంగూబాయి కతియావాడి’ తెలుగు టీజర్‌

బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గంగూబాయి కతియావాడి”. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’ అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గంగూబాయి కతియావాడీ’ తెలుగు టీజర్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు అలియా భట్ గురువారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రం టీజర్ శుక్రవారం విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ స్క్రీనింగ్ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని ఆమె పేర్కొన్నారు. ‘అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేటర్లలో ‘గంగూబాయి కతియావాడి’ తెలుగు టీజర్ విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ అలియా ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ కు విశేష స్పందన వస్తుంది. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates