HomeTelugu Big Storiesమారిపోయిన Jio Hotstar Subscription రేట్లు ఎలా ఉన్నాయంటే

మారిపోయిన Jio Hotstar Subscription రేట్లు ఎలా ఉన్నాయంటే

All you need to know about Jio Hotstar Subscription rates
All you need to know about Jio Hotstar Subscription rates

Jio Hotstar Subscription Rates:

OTT వినియోగదారులకు శుభవార్త. JioCinema మరియు Disney+ Hotstar విలీనం అయ్యి JioHotstar గా మారింది. ఇది భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గా అవతరించగా, వినియోగదారులకు మూడు లక్షల గంటల కంటెంట్, లైవ్ స్పోర్ట్స్, మరియు బహుళ భాషల్లో వినోదాన్ని అందించనుంది.

JioHotstar వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ను అందిస్తోంది. కేవలం రూ.149/క్వార్టర్ నుండి ప్రారంభమవుతున్న ఈ ప్లాన్‌లను JioCinema, Disney+ Hotstar ప్రస్తుత సభ్యులు సులభంగా మార్చుకోవచ్చు.

JioHotstar కనీస సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.149 (మూడు నెలలు) ఉంటుంది, కానీ దీనిలో యాడ్స్ ఉంటాయి. యాడ్స్ లేకుండా చూడాలంటే రూ.499 చెల్లించాలి. ఇప్పటికే JioCinema లేదా Disney+ Hotstar సభ్యత్వం ఉన్న వాళ్లకు వారి ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా JioHotstar సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. JioCinema యాప్ పూర్తిగా నిలిపివేయబడుతుంది.

JioHotstarలో 10 భారతీయ భాషల్లో 3 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. ఇది 500 మిలియన్ల మంది వీక్షకులను కలిగి ఉంది.

JioStar ఎంటర్టైన్మెంట్ సీఈఓ కెవిన్ వాజ్ ఈ మార్పుల గురించి వివరించారు. JioCinema Premium సభ్యులు – వీరి ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ పూర్తయ్యేంత వరకు JioHotstar Premiumకి అప్‌గ్రేడ్ అవుతారు. తర్వాత కొత్త JioHotstar ప్లాన్ తీసుకోవాలి.

Disney+ Hotstar సభ్యులు – వీరు తాము తీసుకున్న ప్లాన్‌నే మూడునెలల పాటు అలాగే కొనసాగించొచ్చు. కస్టమర్లకు ఈ మార్పులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెల్లగా అమలు చేస్తామని వాజ్ తెలిపారు.

JioHotstar లో Disney, HBO, NBCUniversal Peacock, Warner Bros. Discovery, Paramount వంటి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, IPL, WPL, ICC టోర్నమెంట్లు లాంటి స్పోర్ట్స్ స్ట్రీమింగ్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ లో చూడొచ్చు.

JioHotstar ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ISL లాంటి దేశీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్ కు సరికొత్త మలుపునిస్తుంది. JioStar స్పోర్ట్స్ CEO సంజోగ్ గుప్తా ప్రకారం, “భారతదేశంలో క్రీడలు ఆట కాదు, అనుభవం. JioHotstar అందించే అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాన్స్‌కు మరింత రియల్ టైమ్ అనుభవం కలిగించనుంది” అన్నారు.

ఈ భారీ విలీనం వల్ల Amazon Prime, Netflix, Zee5 లాంటి ఇతర OTT ప్లాట్‌ఫామ్స్‌ కు గట్టి పోటీ ఏర్పడనుంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేక కంటెంట్ అందించే JioHotstar, దేశీయ మార్కెట్ పై పెను ప్రభావాన్ని చూపనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu