మహేష్ కోసం నరేష్ పాట్లు!

ఈ మద్య మల్టీ స్టారర్ సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో దర్శక, నిర్మాతలు అలాంటి చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్ తో కలిసి మహేష్ బాబు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మ‌హేష్ బాబు మ‌రో మ‌ల్టీ స్టార‌ర్‌తో వ‌స్తున్నాడు. అయితే, ఈ సారి అల్ల‌రోడితో క‌లిసి అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం న‌రేష్ బ‌రువు పెర‌గాల్సి వ‌చ్చింద‌ట‌. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన న‌రేష్ లావుగా క‌న‌ప‌డేస‌రికి.. అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

అస‌లు విష‌యం ఏమిటీ అని ఆరా తీస్తే మ‌హేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమా కోసం అల్ల‌రోడు అలా బొద్దుగా మారిపోయాడ‌ని తెలిసింది. ప్రస్తుతం మహేష్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతాడు. 

CLICK HERE!! For the aha Latest Updates