భీమనేనితో మరోసారి!

ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో చివరిసారిగా సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత నరేష్ చేసిన రొటీన్ కామెడీ ఎంటర్టైనర్లతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా నిరాశపరిచాయి. దాంతో మరోసారి తనకు పట్టున్న కామెడీ జోనర్ లోనే విజయం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు.

చివరి సక్సెస్ అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సుడిగాడు సినిమా తరహాలోనే ఈ సినిమాని రీమేక్ గానే తెరకెక్కించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ కామెడి చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.