బన్నీ న్యూ మూవీ ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే..!


స్టాలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు శుభవార్త. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ కొత్త ప్రాజెక్టు ఖరారైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ప్రకటన విడుదల చేసింది.

బన్నీ 19వ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ‘జులాయి, S/o సత్యమూర్తి.’ వంటి హిట్‌ సినిమాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అందరికీ చిత్ర బృందం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ‘AA19’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌లో మూడో స్థానంలో ఉంది.