మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బాగానే శృతి కుదిరినట్టు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత భారీ హిట్‌ను సాధించడమే కాకుండా మ్యూజికల్‌గానూ వర్కౌట్ అయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌కు కూడా తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అందులో సంగీత దర్శకుడు కచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ అనే అనుకుంటారు అభిమానులు. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ.. ప్రస్తుతం బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్-త్రివిక్రమ్-తమన్ మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమన్ ట్విటర్ ద్వారా తెలిపాడు. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నాయని అదే ప్రాసెస్‌లో ఉన్నామని ట్వీట్ చేశాడు.
#AA19
And we r on process with our music 🎶
The master of writing ✍️ #trivikram sir
& our #stylishstar @alluarjun ♥️#AATT 🎵 pic.twitter.com/KB4MXtnqV4— thaman S (@MusicThaman) June 23, 2019












