HomeTelugu Trendingనీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం: అల్లు అర్జున్‌

నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం: అల్లు అర్జున్‌

Allu arjun birthday wishes
టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ​కొడుకు అయాన్, కూతురు ఆర్హా. ఈ రోజు (సెప్టెంబర్‌ 29న) స్నేహ పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్‌ చెబుతూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు బన్ని.

‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ’ అని క్యాప్షన్‌ని దానికి జోడించాడు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి ఆమెకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ వెల్లువెత్తాయి. దీంతో ట్విట్టర్‌లో #allusnehareddy ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!