పుకార్లే అంటూ కొట్టి పారేసిన సమంత


అక్కినేని వారి కోడలు ప్రముఖ హీరోయిన్ సమంతకు ఆమె తల్లికి పెద్దగా పడటం లేదని అందుకే ఆమెను దూరంగా పెట్టిందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందించింది. తనకు అమ్మ అంటే చాలా ఇష్టం అని చిన్నప్పటి నుంచి తనకోసం ప్రార్ధనలు చేసేదని, తనకు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మే చూసుకునేదని చెప్పింది. అమ్మ రెండో దేవత అని అలాంటి అమ్మకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అంటోంది. అంతేకాదు తన తల్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సమంత వివాహం తరువాత కూడా హీరోయిన్ గా చాలా బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది వరుసగా విజయాలను అందుకున్న సమంత ఈ సంవత్సరం కూడా మజిలీతో భారీ హిట్ కొట్టింది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓ బేబీ’ సినిమాలో నటిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates