షూటింగ్ కు ‘డిజె’ రెడీ!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొంత భాగం పూర్తయింది.

అయితే తనకు కూతురు పుట్టిన కారణంగా అల్లు అర్జున్ కొన్ని రోజులు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నాడు. దీంతో హీరో లేని సన్నివేశాలను ఇప్పటివరకు చిత్రీకరించాడు దర్శకుడు హరీష్ శంకర్.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 18 నుండి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ జాయిన్ కానున్నాడు. సుమారు 15 రోజుల పాటు సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.