HomeTelugu Big Storiesసుకుమార్‌ లేకపోతే నేను లేను: అల్లు అర్జున్‌

సుకుమార్‌ లేకపోతే నేను లేను: అల్లు అర్జున్‌

Allu arjun 1

డైరెక్టర్‌ సుకుమార్‌ ,’ఆర్య’ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదంటూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సుకుమార్‌ కూడా ఎమోషనల్‌ అయ్యారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన మాస్ యాక్షన్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప థ్యాంక్యూ మీట్‌’ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

Allu arjun get emotional at

‘సుకుమార్‌ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఆయన కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే మన వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌తో పంచుకోలేం. సుకుమార్‌ నాకు అంత సన్నిహితమైన వ్యక్తి. సుకుమార్‌ అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి. సుకుమార్‌ ఉంటే నా లైఫ్‌ ఒకలా ఉంది. లేకపోతే వేరేలా ఉండేది. ప్రతి మనిషికీ 18-19ఏళ్ల వయసులో జీవితంలో ఏం అవ్వాలన్న సందిగ్ధత ఉంటుంది. వారు ఎంచుకునే కెరీర్‌ బట్టి అది ముందుకు వెళ్తుంది. నేను సినిమాలు చేద్దామనుకున్నప్పుడు సుకుమార్‌తో చేయడం వల్ల లైఫ్‌ ఇలా వచ్చింది. మరొకరితో చేస్తే ఇంకెలా ఉండేదో. ఒకటైతే చెప్పగలను ఐకాన్‌స్టార్‌ వరకూ రాగలిగాను అంటే దానికి కారణం సుకుమార్‌గారు. ఆరోజుకు అది వన్‌ డిగ్రీ కాన్సెప్ట్‌. ఇది ఎలా పనిచేస్తుందంటే షిప్‌ వెళ్లేటప్పుడు ఒక డిగ్రీ పక్కకు జరిగితే వెళ్లాల్సిన చోటుకు కాకుండా పక్క ఖండానికి వెళ్లిపోతుంది. నా జీవితానికి సుకుమార్‌ ఆ చిన్న డిగ్రీ. ‘నేను మీకు రుణపడి ఉన్నా’ అనే మాట నా జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే వాడగలను. నా తల్లిదండ్రులు, మా తాతయ్య, మా చిరంజీవిగారికి, ఆ తర్వాత సుకుమార్‌కు మాత్రమే’

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!