HomeTelugu Trendingఅతను నా ఫ్యాన్‌ అని తెలిసి సర్‌ప్రైజ్‌ అయ్యా: బన్నీ

అతను నా ఫ్యాన్‌ అని తెలిసి సర్‌ప్రైజ్‌ అయ్యా: బన్నీ

9స్టైల్‌ విషయంలో అల్లు అర్జున్‌ను మించిన నటుడు టాలీవుడ్‌లో మరొకరు లేరనే చెప్పాలి. అందుకే అభిమానులు ఆయన్ను స్టైలిష్‌ స్టార్‌ అని పిలుస్తుంటారు. అలాంటి ఆయన్నే మరో నటుడు తన స్టైల్‌తో షాకయ్యేలా చేశాడు. అతనే బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది. ‘గల్లీ బాయ్‌’ చిత్రంలో షేర్‌ పాత్రలో నటించిన సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇటీవల సిద్ధాంత్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని, ఆయన్ను ఒక్కసారైనా కలవాలనుకుంటున్నానని అన్నారు.
దీని గురించి తాజాగా అల్లు అర్జున్‌ ఓ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘సిద్ధాంత్‌ నా ఫ్యాన్‌ అని తెలిసి సర్‌ప్రైజ్‌ అయ్యా. ఎందుకంటే ‘గల్లీ బాయ్‌’లో నాకు సిద్ధాంత్‌ నటన చాలా నచ్చింది. చెప్పాలంటే తొలి సినిమాతోనే తన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. మున్ముందు అతను చేయబోయే సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. త్వరలో అతన్ని కలుస్తాను’ అని తెలిపారు.

అనంతరం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా ఎంతో వినోదాత్మకంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. సినిమా విడుదలయ్యాక మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడే ఆ రహస్యాన్ని చెప్పేస్తే ఇక మున్ముందు చెప్పడానికి సర్‌ప్రైజ్‌ అంశాలు ఏమీ ఉండవు. ఇక సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది ఇంకా చర్చల్లోనే ఉంది. ఏదీ ఫైనలైజ్‌ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడే నేనేమీ చెప్పలేను. టబు నటనంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు బన్నీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!