HomeTelugu Trendingమా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ: నమ్రత

మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ: నమ్రత

Namrata shared her children

నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహేష్‌ బాబుతో పాటు వారి పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించి వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అప్పుడప్పుడు మైండ్‌ గేమ్స్‌ పోస్ట్ చేసి.. మీ ఐక్యూని టెస్ట్ చేసుకోమని చెబుతుంటారు. తాజాగా ఆమె తన పిల్లలు స్విమ్‌ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్‌ చేశారు. మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ అంటూ ఆమె షేర్‌ చేశారు.

‘మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ. వాళ్లకి ఇష్టమైన గేమ్స్ ప్రోత్సహిస్తూనే.. అన్నింటిలో ప్రావీణ్యం ఉండాలని చెబుతుంటాను. వ్యాయామంతో పాటు ఏదైనా ఆట ఆడుతూ ఉంటే.. మెదడు ఉత్తేజితమవుతుంది..” అని నమ్రత పేర్కొంది. దీనికి మహేష్‌ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌, సితారలు స్విమ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu