HomeTelugu Newsపవన్‌ పిలుపుతో మరోసారి తిత్లీ బాధితులకు సాయం అందించిన బన్నీ

పవన్‌ పిలుపుతో మరోసారి తిత్లీ బాధితులకు సాయం అందించిన బన్నీ

11 15స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ మరోసారి తిత్లీ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 మండలాల్లో వెయ్యికి పైగా గ్రామాలు తిత్లీ తుఫాను బారినపడ్డాయి. దీంతో పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. గృహాలు శిథిలావస్థకు చేరి నిలువ నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా తాగునీరు కలుషితమై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంతేకాదు వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రతీ ఒకర్ని అభ్యర్థించారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఇటీవల రామ్‌చరణ్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ 3 ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్ వెల్ వేయించేందుకు ముందుకు వచ్చారు. దీని ద్వారా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందనుంది. మరో 15 రోజుల్లో ఈ వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ అందుబాటులోకి రానున్నాయని బన్నీ ప్రతినిధులు తెలిపారు. ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి సురక్షిత మంచి నీరు అందనుందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు ఇప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, అందుకే నీటి పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!