నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో నాన్నా ప్లీజ్: అర్హతో బన్నీ.. స్నేహారెడ్డి సెటైర్‌.. వైరల్‌

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇప్పుడు కుటుంబంతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్ సినిమా ఒప్పుకున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇంట్లో పిల్ల‌ల‌తో ఎంజాయ్‌ చేస్తున్నాడు బ‌న్నీ. హాయిగా వాళ్ల‌తోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. తాజాగా బ‌న్నీ త‌న కూతురుపై ఆడుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

తాను చెప్పిన‌ట్లుగా కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వ‌ర‌కు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి తెగ షేర్లు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ఈ వీడియోను ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసాడు.

View this post on Instagram

My Donga fellow 😘 ❤️

A post shared by Allu Arjun (@alluarjunonline) on

దీనిపై అల్లు స్నేహారెడ్డి కూడా స్పందించింది. నువ్వు చేసుకున్నావా మీ నాన్న చూపించిన అమ్మాయిని అంటూ ప్రశ్న వేసింది. దానికి బన్నీ కూడా అబ్బ చా నువ్వు చేసుకున్నావా మరి అంటూ రిప్లై ఇచ్చాడు. బన్నీ, స్నేహా మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి మంచు లక్ష్మి, హన్సిక, రాశీ ఖన్నా కూడా స్పందించారు. మొత్తానికి ఈ అల్లు వారి జంట సోషల్ మీడియా కబుర్లు ఇప్పుడు అభిమానులను బాగా అలరిస్తున్నాయి.