రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ పుష్ప

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో హీరో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. అప్పటి నుంచి ఈ వీడియో వరుసగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా టాలీవుడ్‌లోనే అతి తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ సాధించిన ఇంట్రో వీడియోగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ వీడియో ఆల్ టైమ్‌ రికార్డును సెట్ చేసింది. టాలీవుడ్ లోనే 60 మిలియన్లకు పైగా వ్యూస్, 1.4 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన మొట్టమొదటి, ఫాస్టెస్ట్ టీజర్ గా నిలిచింది.

CLICK HERE!! For the aha Latest Updates