HomeTelugu Trendingపుష్ప మేకింగ్ వీడియో విడుదల

పుష్ప మేకింగ్ వీడియో విడుదల

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచార చిత్రాలను విడుదల చేసిన చిత్రబృందం పలు పోస్టర్లు, పాటలు, టీజర్లు విడుదల చేసింది. డిసెంబర్ 6న టైలర్‌ను విడుదల చేయబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఓ అడవిలో షూటింగ్‌కు సంబంధించిన అంశాలను ఇందులో చూడొచ్చు. ఈ షూటింగ్‌ ప్రారంభం కాకముందు చిత్ర బృందానికి అల్లు అర్జున్‌ ఓ విజ్ఞప్తి చేశారు. దాన్ని ఈ వీడియోలో జతచేశారు. ఎవరు వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పుల్ని వారే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి. మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం అని సూచిస్తున్న వీడియోను జత చేశారు.

Pushpa 2

డిసెంబరు 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!