HomeTelugu Trending'యానిమల్‌'పై అల్లు అర్జున్‌ రివ్యూ

‘యానిమల్‌’పై అల్లు అర్జున్‌ రివ్యూ

Allu Arjun review on Animaబాలీవుడ్ న‌టుడు రణబీర్ కపూర్ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ.563 కోట్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు యానిమ‌ల్‌పై ప్రశంసలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని.. ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ పిచ్చెక్కించింద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్ పీరియన్స్‌ను వేరే లెవల్ కు తీసుకువెళ్లావు.

చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీ మ్యాజిక్‌తో నా నోట మాటలు రావడం లేదు. రష్మిక, బ్రిలియంట్ గా నటించావ్ ఇప్పటి దాకా నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది, ఇంకా ఇలాంటివి మరెన్నో చేయబోతున్నావని అర్ధం అవుతోంది. బాబీ డియోల్ మీ న‌ట‌న మమ్మల్ని సైలెంట్ చేసింది, మీ టెరిఫిక్ నటనకు నా రెస్పెక్ట్.

యంగ్ హీరోయిన్ తృప్తి గుండెలను బ్రేక్ చేస్తోంది, ఇంకా చేస్తుందని భావిస్తున్నాను. మిగతా అందరు నటీనటులు, టెక్నీషియన్లు కూడా సినిమాను మరో లెవల్‌కి తీసుకు వెళ్లారు, వాళ్లందరికీ కంగ్రాట్స్. సందీప్ రెడ్డి వంగా జస్ట్ మైండ్ బ్లోయింగ్.

మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇప్పుడు మరియు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో నేను స్పష్టంగా చూడగలనని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. కాగా ఈ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!