హార్ట్‌ టచింగ్‌ వీడియో: అల్లు అర్జున్‌


టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ సాంగ్‌ ఎంత హిటైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ దాకా ఈ పాటకు చిందులేస్తున్నారు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది నా హృదయాన్ని తాకిందంటూ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

ఇంతకీ ఈ వీడియోలో ఆడిపాడుతోంది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని వ్యక్తి బుట్టబొమ్మ అంటూ డ్యాన్స్‌ చేయగా దానికి చేతులు లేని యువతి డ్యుయెట్‌ చేసింది. దీనిపై బన్నీ స్పందిస్తూ ‘హార్ట్‌ టచింగ్‌ వీడియో. సంగీతం మనిషి వైకల్యాన్ని మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో నిరూపించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అందులోని పాటలు అంతకు రెట్టింపు పాపులర్‌ అయ్యాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ తన తర్వాతి సినిమా కోసం దర్శకుడు సుకుమార్‌తో కలిసి పని చేయనున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates