అమ్మాయిల్లో బన్నీకి నచ్చే రెండు విషయాలు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అమ్మాయిలో రెండు విషయాలు బాగా నచ్చుతాయట.. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు అందంగా ఉండాలనుకుంటారు కానీ బన్నీకి అందం ముఖ్యం కాదు. అమ్మాయిల్లో నవ్వు, డిగ్నిటీ అంటే ఈ హీరోకు బాగా నచ్చుతాయట. ఈ విషయాన్ని ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో ఫంక్షన్ లో బన్నీ స్వయంగా వెల్లడించాడు. హీరోయిన్ పూజా హెగ్డేను ఉద్దేశించి బన్నీ ఈ విషయాలు చెప్పాడు.

అమ్మాయిలు నవ్వుతూ ఉండడం, హుందాగా వ్యవహరించడం చాలా ఇష్టమని ఆ రెండు కూడా పూజాలో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సినిమా తరువాత పూజా ఎక్కడికో వెళ్లిపోతుందని.. ఆమె రేంజ్ ఖచ్చితంగా మారిపోతుందని అన్నారు. పూజాతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ ను తెగ పొగిడేశారు. ఎవరైనా.. హీరోయిన్ ను పువ్వులా చూసుకుంటారని మా దర్శకుడు మాత్రం షూటింగ్ టైమ్ లో నన్ను పువ్వులా చూసుకున్నారని అన్నారు. ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.