HomeTelugu TrendingPushpa 2: పుష్ప 2 వాయిదా ఒక ముందు జాగ్రత్త చర్య?

Pushpa 2: పుష్ప 2 వాయిదా ఒక ముందు జాగ్రత్త చర్య?

Pushpa 2
Allu Arjun to play safe by postponing Pushpa 2

Pushpa 2 Release Date: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమా పుష్ప 2. 2021 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి.

నిజానికి ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ చిత్ర బృందం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అని, నిర్మాణాంతర పనుల కోసం కూడా కొంత సమయం కావాలని, సినిమాని డిసెంబర్ కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈడాది డిసెంబర్ 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది.

మరోవైపు గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య.. జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన సొంత కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా.. నంద్యాల వెళ్లి వైసిపి కార్యకర్త శిల్పా రవికి సపోర్ట్ చేయడంపై.. మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య కూడా.. సోషల్ మీడియాలో చిన్న సైజు యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విడుదల అవుతుంది అని.. సినిమా ఎలా హిట్ అవుతుందో మేము కూడా చూస్తాము అని.. పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులపై మండిపడుతున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు.. తాము ఉండగా సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదని.. చాలెంజ్ ను విసురుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాదాలపై రియాక్ట్ అవకుండా సైలెంట్ గా ఉండటం తో.. అభిమానులు ఇంకా కోపం తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి మెగా అభిమానులు అందరికీ అల్లు అర్జున్ పై బాగా నెగిటివిటీ పెరిగిపోయింది.

ఈ సమయంలో సినిమాని విడుదల చేసినా కూడా.. కొన్ని వర్గాల ప్రేక్షకులు కావాలనే సినిమా బాగాలేదని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ ముందు జాగ్రత్తగా సినిమాని వాయిదా వేశారా.. అని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ పుకార్లకి చెక్ పెట్టాలంటే అయితే పవన్ కళ్యాణ్ లేదా అల్లు అర్జున్ లో.. ఎవరో ఒకరు ఈ వివాదం గురించి మాట్లాడి.. ఫాన్స్ ని కూల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదు అంటే చిలికి చిలికి ఇది గాలివానగా మారుతుందా.. లేక తగ్గిపోతుందా అనేది కాలమే చెప్పగలదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!