మోడల్స్ కి బన్నీ వార్నింగ్!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. అయితే ఈ సినిమా సెట్స్ లో బన్నీ కొందరు మోడల్స్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమాలో సంగీత్ సీన్ ఒకటి ఉంటుందట. దానికోసం
అలంకరణతో కూడిన భారీ సెట్ ను ఏర్పాటు చేసిందట చిత్రబృందం. ఆ ఒక్క సీన్ కోసం చాలా మంది మోడల్స్ ను కూడా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే సెట్ ను చూసి మైమరిచిపోయిన ఆ మోడల్స్ వారి ఫొటోల్లో ఆ సెట్ అందాలను బంధించారట. అంతేకాదు వారు కూడా గ్రూప్ ఫోటోలని, సెల్ఫీలు అంటూ తెగ ఫోటోలు దిగారట. దీంతో బన్నీకు విపరీతమైన కోపం వచ్చిందట. ఒక్క స్టిల్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ.. ఆదేశించాడట. షూటింగ్ ప్లేస్ కానీ.. దాని వివరాలు కానీ ఎవరికి తెలియడానికి వీల్లేదని కావాలంటే సెట్ బయట ఫోటోలు తీసుకోమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో బన్నీ ఈ సినిమా విషయంలో ఎంత జాగ్రత్త వ్యవహరిస్తున్నాడో.. తెలుస్తోంది!