HomeTelugu Trendingవారణాసికి పయనమైన 'పుష్ప'

వారణాసికి పయనమైన ‘పుష్ప’

Allu arjun will go to varan

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా ఏడు నెలల పాటు వాయిదా పడి ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొంత జరుపుకుంది. అక్కడ బన్నీపై కొన్ని యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. ఇక తిరిగి తదుపరి షెడ్యూలును డిసెంబర్ 18 నుంచి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూలుని వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. అక్కడ ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. కాశీ బ్యాక్ డ్రాప్ లో ఆ పాటను చిత్రీకరించాల్సి ఉన్నందున అక్కడికి వెళుతున్నారట.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో పుష్పరాజ్ అనే డ్రైవర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!