HomeTelugu TrendingSamantha అన్ని కోట్లు నష్టపోవడానికి కారణం అదేనా?

Samantha అన్ని కోట్లు నష్టపోవడానికి కారణం అదేనా?

Here's how Samantha lost crores!
Here’s how Samantha lost crores!

Samantha Brand Endorsements:

సమంత రూత్ ప్రభు పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది టాలెంట్, గ్లామర్, గ్రేస్. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ఇంకో విశేషానికి చర్చల్లో ఉంది. ఆమె తాజాగా చేసిన ఓ వ్యక్తిగత వెల్లడనతో ఎంతోమంది ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

సమంత తన హెల్త్, ఫిట్‌నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. ఆమెకు 2022లో మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వచ్చాక, జీవితం మీద దృష్టికోణం మారిపోయిందట. అందుకే ఇప్పుడు ఏదైనా బ్రాండ్ యాడ్ చేయాలంటే, ముందుగా ముగ్గురు డాక్టర్లతో సంప్రదించి, అది నిజంగా మంచిదేనా అని తెలుసుకుంటుందట.

ఇంత బాధ్యతతో వ్యవహరించే సమంత గతంలో మాత్రం అంత జాగ్రత్తగా లేఖుండా యాడ్స్ చేసిందట. అప్పట్లో ఎక్కువ బ్రాండ్స్ అనేది గుర్తింపు లక్షణంగా అనిపించేదట. కానీ ఇప్పుడు ఆలోచన మారిందట. అదే కారణంగా ఆమె తన విలువలకు సరిపోని 15 బ్రాండ్ డీల్‌లను వదులుకుంది. దీని వల్ల కోట్లు కోల్పోయిందట.

“నిజంగా అప్పట్లో చాలా బ్లైండ్‌గా, స్టూపిడ్‌గా అనిపిస్తోంది,” అని చెప్పిన సమంత, ఇప్పుడు తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందంటోంది.

ఈ విషయం తెలియగానే అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. డబ్బుకు పదవికి కాదు, నిజాయితీకి, బాధ్యతకు ప్రాధాన్యం ఇచ్చే సెలబ్రిటీలను చూడడం చాలా సంతోషంగా ఉందంటున్నారు.

సమంత ఈ రోజుల్లో ఒక ఆధ్యాత్మికమైన, ప్రశాంతమైన జీవనశైలికి మరింత దగ్గరవుతోంది. యాడ్స్ దూరం చేసుకుంటూ తన విలువల్ని నిలుపుకుంటున్న ఈ హీరోయిన్ నిజంగానే ఆదర్శప్రాయమైన స్టార్ అనడంలో సందేహం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu