హిందీలోనూ హిటైన అల్లు అర్జున్‌ మూవీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ఇటీవలే హిందీలోకి ‘సూర్య ది సోల్జర్’ పేరుతో డబ్ అయి మంచి వసూళ్లను రాబడుతూ హిట్ గా నిలిచింది. బన్నీ అంటే తెలుగులో మాత్రమే కాదు తమిళం, మలయాళం, హిందీలో కూడ మంచి క్రేజ్ ఉంది. అందుకే తెలుగులో రిలీజైన ప్రతి సినిమా మలయాళం, హిందీలోకి కూడ అనువాదం అవుతూ ఉంటుంది.

ఇంతకు ముందు మలయాళంలోకి కూడ అనువాదమైన ఈ సినిమా అక్కడ కూడ పెద్ద విజయంగా నిలిచింది. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పరాజయంగా నిలిచింది. వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో బన్నీ యాంగర్ మేనేజ్మెంట్ సమస్య ఉన్న సోల్జర్ పాత్రలో కనిపించాడు.