వావ్‌‌.. అల్లు అర్జున్ కారవాన్‌ చూశారా!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రయూనిట్‌ ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోయినా తాజాగా సెట్‌లో కనిపించిన కారవాన్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి బన్నీ స్పెషల్‌గా డిజైన్‌ చేయించిన కారవాన్‌ను వాడుతున్నాడు.

ఇప్పటికే కారవాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బన్నీ దాదాపు 7 కోట్లతో పాల్కన్‌ కంపెనీకి కారవాన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నాడట. ముంబైకు చెందిన ప్రముఖ డిజైనర్‌లు అల్లు అర్జున్‌ టేస్ట్‌కు తగ్గట్టుగా ఇంటీరియర్‌ను డిజైన్‌ చేశారు. తాజాగా కారవాన్‌కు సంబంధించిన ఇంటీరియర్‌ ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు బన్నీ.

కారవాన్‌ ఫోటోలతో పాటు ‘జీవితంలో పెద్ద స్థాయిలో ఏది కొన్న ఒకే విషయం గుర్తుకు వస్తుంది. అభిమానులు నామీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వారి ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఇవన్నీ కొనగలుగుతున్నాను. నా మీద ప్రేమ చూపిస్తున్న అందరికీ రుణపడి ఉంటాను’ అంటూ ట్వీట్‌చేశాడు అల్లు అర్జున్.